ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనర్​పై అత్యాచారం... నిందితుడిపై కేసు నమోదు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 11ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన రాజారావు అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

rape attempt on minor girl
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో బాలికపై అత్యాచారం

By

Published : Aug 26, 2020, 12:05 PM IST


ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన మైనర్​పై అత్యాచారం జరిగింది. 11 ఏళ్ల బాలిక ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా... ఎల్లూరు రాజారావు అనే వ్యక్తి దగ్గరకు పిలిచి మాయమాటలు చెప్పి లోబర్చుకుందామనుకున్నాడు. బాలిక లొంగక పోవడంతో కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక... తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. కుటుంబసభ్యులు రాజారావుపై స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయటంతో... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details