Police candidate Rajender died: పోలీస్ కానిస్టేబుల్ ఎంపికల్లో అస్వస్థకు గురై వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్.. ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ నెల 17న కేయూ విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించిన 1600 మీటర్ల పరుగులో.. రాజేందర్ అస్వస్థతకు గురయ్యాడు. నాలుగు రోజులపాటు వెంటిలేటర్‌పై డాక్టర్లు చికిత్సను అందించారు. రాజేందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి మృతి చెందాడు. మృతదేహాన్ని రాజేందర్ స్వగ్రామం ములుగు జిల్లా శివతాండకు పోలీసులు తరలించారు. రాజేందర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
పోలీసు ఎంపికలో అస్వస్థతకు గురైన రాజేందర్ మృతి - AP NEWS LIVE UPDATES
Police candidate Rajender died: ఈ నెల 17వ తేదీన పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో అస్వస్థతకు గురైన అభ్యర్థి మృతి చెందాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములుగు జిల్లా శివతాండకు చెందిన రాజేందర్ ఇవాళ తెల్లవారుజామున మరణించాడు. నాలుగు రోజులు పాటు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్న రాజేందర్ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
Etv Bharat