విస్తారంగా వర్షం... అన్నదాతల్లో హర్షం - farmers
వరుణుడి కోసం నిరీక్షిస్తున్న అన్నదాతకు ఊరట లభించింది. వర్షాలు కురవటంతో కంది, పత్తి, చిరుధాన్యాల రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.
rains
నాలుగేళ్లుగా వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రైతులకు ఇటీవల కురిసిన వర్షాలు ఊరటనిచ్చాయి. భూమినే నమ్ముకున్న రైతులు ఈఏడాది సాగు మొదలు పెట్టారు. ఆలస్యంగా వర్షాలు కురవడం వల్ల కంది, పత్తి, చిరుధాన్యాల సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన విత్తనాలు మొలకెత్తాయి. మిరప నారు పోసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వరినాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాదైనా పంట చేతికి దక్కుతుందన్న ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నారు.