ప్రకాశం జిల్లా పొదిలిలో మోస్తరు వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మార్కాపురం లోను జల్లులు కురిశాయి. చాలా రోజుల తర్వాత వర్షం కురిసిందంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అద్దంకిలో ఈదురుగాలులతో వర్షం పడింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆనందాన్ని పంచుకున్నారు. మరో రెండు రోజులపాటు వర్షం పడితే సాగు చేసుకునేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు. మరోవైపు.. ఈ జల్లులు తమ పనికి ఆటంకంగా మారాయని ఇటుక బట్టీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
ప్రకాశం జిల్లాలో వర్షాలు.. ఆనందంలో రైతన్నలు - prakasam
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ప్రకాశం