ప్రకాశం జిల్లా మార్కాపురంలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. పదకొండు రోజులుగా సాగిన ఉత్సవాల్లో చివరిరోజు జరిగిన రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రథం ఆకట్టుకుంది. అర్చకుల వేద పఠనాల నడుమ శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని ఊరేగించారు. మంత్రి శిద్ధా రాఘవరావు వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అట్టహాసంగా ముగిసిన చెన్నకేశవ రథోత్సవం - prakasham
మార్కాపురంలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజున జరిగిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రథోత్సవం