నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎస్సై వి.మహేష్ ఆధ్వర్యంలో భవానీ కూడలి వద్ధ.. డి.వి. శ్రీనివాసరావు దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఆయన అందించిన సమాచారం మేరకు బల్లికురవ మండలం ముక్తేశ్వరం గ్రామానికి చెందిన టి. పరమేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ లభ్యమైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అద్దంకి పట్టణానికి చెందిన మరో నిందితుడు సురేష్ ద్వారా తమకు సరకు అందినట్లు ఇద్దరు వ్యాపారులు వివరించారు. ఈ నేపథ్యంలో మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల విలువ రూ.40 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు.
అద్దంకిలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత - అద్దంకి వద్ద గుట్కా పట్టివేత
ప్రకాశం జిల్లా అద్దంకి, బల్లికురవ మండలాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించి సరకు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 40 వేలు ఉంటుందని దర్శి డీఎస్పీ కె. ప్రకాశరావు తెలిపారు.
నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత