ప్రకాశం జిల్లా చీరాల ఏరియా ఆసుపత్రిలో ఉన్న సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆసుపత్రిలోని ఎక్స్రే, ఈసీజీకి సంబంధించిన పరికరాలు పనిచేయవు. ఇక్కడ మత్తు డాక్టర్ ఉన్నా.... ఆపరేషన్ సమయంలో ఇంజెక్షన్ బయట కొనుక్కోవాల్సిందే. ఇంతే కాదు.. ఈ ఆసుపత్రిలో అబ్బాయి పుడితే 2 వేలు.. అమ్మాయి పుడితే వెయ్యి ఇనామ్ ఇచ్చుకోవాల్సిందే. ఇలాంటి సమస్యలపై సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాబు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నూతనంగా నిర్మించిన భవనంలో అన్ని వసతులు, పరికరాలు ఏర్పాటు చేసినా ఆసుపత్రి సూపరింటెండెంట్ తిరుపాల్ నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. ఆయన కారణంగా వైద్య పరికరాలు పనిచేయకుండా పోయాయని ఆగ్రహించారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వైద్య పరికరాలకే.. జబ్బొస్తే..! - undefined
అబ్బాయి పుడితే 2000, ఆడపిల్ల పుడితే 1000. ఏంటని అనుకుంటున్నారా? ఇది ప్రకాశం జిల్లా చీరాలలో ఉన్న గోపాలకృష్ణయ్య ఏరియా ఆసుపత్రిలోని ప్రసూతి వైద్యులకు చెల్లించుకోవాల్సిన ముడుపులు.
వైద్య పరికరాలకు జబ్బొచ్చింది
TAGGED:
cheerala