పిల్లలను తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు బాధ్యత తీసుకుంటేనే ఉత్తమపౌరులుగా ఎదుగుతారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని వీఆర్ఎస్ & వైఆర్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ మన్నేపల్లి బ్రహ్మయ్య పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, తెదేపా నేతలు పాల్గొన్నారు. బ్రహ్మయ్యను నేతలు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కళాశాలకు తెలుగురాష్ట్రాల్లో ఎంతో మంచిపేరు ఉందని తెలిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారని తెలిపారు. అధ్యాపకులు అంకిత భావంతో పనిచేస్తే విద్యార్థులు మంచి పౌరులుగా తయారవుతారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అధ్యాపకులు బాధ్యత తీసుకుంటేనే.. విద్యార్థులు ఉత్తమ పౌరులవుతారు' - prakasam
ప్రకాశం జిల్లా చీరాలలోని వీఆర్ఎస్ & వైఆర్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ బ్రహ్మయ్య పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
చీరాల