కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న తమ నాయకులు కోలుకుని ప్రజల్లోకి రావాలని కోరుతూ వైకాపా నాయకులు ప్రకాశం జిల్లా చీరాలలోని మసిద్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, యువ నాయకులు కరణం వెంకటేష్‌లు త్వరగా కోలుకోవాలని అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో స్థానిక మార్కస్ మసీద్‌లో మౌలానా చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని మసీదులో ప్రార్థనలు - Prayers at the Chirala Mosque
కరోనాతో హైదారాబాద్‌లో బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, యువ నాయకులు కరణం వెంకటేష్‌లు చికిత్స పొందుతున్నారు. వీరు త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలోని మసీదులో అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ప్రార్థనలు నిర్వహించారు.
వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని చీరాల మసీదులో ప్రార్థనలు