ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశంజిల్లా నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ. - immersion places

వినాయకనిమజ్జనం జరుగు ప్రాంతాలలో పోలీసులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం ఎస్పీ వినాయక కమిటీలకు ,ప్రజలకు పలు సూచనలు చేశారు.

prakasham sp visit to the immersion places near to sea

By

Published : Sep 5, 2019, 10:28 AM IST

ప్రకాశం జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో జాగ్రత్తలకై నిమజ్జన ప్రాంతాలను ఎస్పీ. సిధ్దార్థ కౌశిక్‌ పరిశీలించారు. జిల్లాలో అత్యధికంగా కొత్తపట్నం మండలంలో సముద్రంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. 10 అడుగుల పైబడిన విగ్రహాలను ఎలా తీసుకువెళ్ళాలి, ట్రాఫిక్‌ నిబంధనలు, ఊరేగింపులో తీసుకోవలసిన జాగ్రత్తలు, నిమజ్జనం సమయంలో సముద్ర ఆటుపోటుల వివరాలు, ఎంతమేరకు వెళ్ళి నిమజ్జనం చేయాలి? అనే విషయాలపై సంబంధింత పోలీస్‌ సిబ్బంది, విగ్రహ కమిటీలు, ప్రజలకు వివరించారు. కొత్తపట్టణం సముద్ర ప్రాంతాన్ని మోటార్‌ సైకిల్‌ మీద వెళ్ళి పరిశీలించి, అక్కడ గత ఈతగాళ్ళను, పోలీసు, మెరైన్‌ పోలీస్‌లను అప్రమత్తం చేసారు.. నిమజ్జన సమయంలో ఎలాంటి ప్రమాదాలు, ప్రాణ నష్టాలు జరగకుండా అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రకాశంజిల్లా నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ.

ABOUT THE AUTHOR

...view details