మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఒంగోలులోని రంగా భవన్‌లో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆంధ్ర ప్రజల ఆశలసౌధం, అందరికీ ఆమోదయోగ్యమైన అమరావతిని కాదని మూడు ముక్కలు చేసి ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేయటం సరికాదని నేతలు వ్యాాఖ్యానించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా రాజధానులు మార్చడం ఎంతవరకూ సబబు అని అఖిలపక్షం సభ్యులు ప్రశ్నించారు. బోస్టన్ కమిటీ పేరుతో అధికార పక్షం తనకు అనుకూలంగా నివేదికలు తయారుచేయించుకొని దేశానికి ప్రతిష్ఠ తీసుకువచ్చే అమరావతిని రద్దుచేయడం అన్యాయమని మండిపడ్డారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన
అందరికీ ఆమోదయోగ్యమైన అమరావతిని కాదని మూడు ముక్కలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయటం సరికాదని ప్రకాశం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా రాజధానులు మార్చడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన !