'మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు' - మూడు రాజధానులపై తెదేపా నిరసనలు న్యూస్
మూడు రాజధానుల నిర్ణయంపై ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'మూడు రాజధానులు వద్ద.. ఒకే రాజధాని ముద్దు'
రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదంపై ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యద్దనపూడి మండల తెదేపా అధ్యక్షుడు నల్లపనేని రంగయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో స్థానిక తెదేపా నేతలు పాల్గొన్నారు.