బిహార్‌కు తరలిస్తున్న వీవీప్యాడ్స్ యంత్రాలు - prakasam dst vvpads news
ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికలకు ఉపయోగించిన వీవీప్యాడ్స్ యంత్రాలను బిహార్ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. 7,700 వీవీ ప్యాడ్ యంత్రాలను బిహార్‌లోని వివిధ జిల్లాలకు పంపుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన వీవీ ప్యాడ్స్ యంత్రాలను బిహార్ రాష్ట్రానికి తరలించనున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ప్రకటించారు. స్థానిక భాగ్యనగర్‌లోని ఈవీఎం గోడౌన్లో భద్రపరిచిన యంత్రాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. గోడౌన్లో ఆయా నియోజకవర్గాల వారీగా క్రమపద్ధతిలో నిల్వచేసిన 7,700 వీవీ.ప్యాడ్ యంత్రాలను తరలిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. బిహార్ రాష్ట్రంలోని ముజిపల్ జిల్లాకు 4,400 వీవీప్యాడ్ యంత్రాలు, గోపాల్ గంజ్ జిల్లాలకు 2,600 యంత్రాలు, సిఫెన్ గంజి జిల్లాకు 700 యంత్రాలు తరలిస్తున్నామని కలెక్టర్ వివరించారు.