వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల పురోగతిపై ప్రకాశం జిల్లా మార్కాపురంలో కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పునరావాస కాలనీల్లో పనులను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేయాలని అదేశించారు. యువకుల ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై పూర్తి నివేదికతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించే వరకు గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తే లేదని ముంపు గ్రామాల ప్రజలు కలెక్టర్కు తెలిపారు. గుండంచర్ల, గొట్టిపడియా గ్రామాల్లో ఇప్పటివరకు కనీస వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కాపురంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష - velugonda project
ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్... అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెలిగొండ పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మార్కాపురంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష