ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dialysis Problems: ఆస్పత్రిలో కరెంట్​ కష్టాలు.. కిడ్నీ రోగుల అవస్థలు

Kanigiri Hospital: కిడ్నీ రోగుల ఆరోగ్యంతో ప్రకాశం జిల్లా కనిగిరిలోని అధికారులు.. చెలగాటం ఆడుతున్నారు. నిత్యం వందల మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులకు డయాలసిస్ సేవలు అందించే ఈ హాస్పిటల్​కి విద్యుత్ ఆగిపోయి రోజులు గడుస్తున్నా.. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్న ఆలోచనే లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి కనెక్షన్ ఇవ్వకపోవడంతో.. విధిలేని పరిస్థితుల్లో జనరేటర్ ద్వారా రోగులకు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. జనరేటర్ కూడా సరిగ్గా పని చేయడం లేదంటూ.. కిడ్నీ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kanigiri Hospital
కనిగిరి హాస్పిటల్

By

Published : Jun 4, 2023, 10:23 PM IST

కిడ్నీ రోగుల పాట్లు.. నెల రోజులుగా విద్యుత్ లేదంటూ బాధితుల ఆవేదన

Interruption to Dialysis Services in Kanigiri Hospital: ఉద్దానం తర్వాత రాష్ట్రంలో ఎక్కువ మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులున్న ప్రాంతం.. ప్రకాశం జిల్లా కనిగిరి కనిగిరి. దాదాపు వెయ్యి మంది వరకూ కిడ్నీ బాధితులు.. ఈ ప్రాంతంలో ఉన్నారు. వీరిలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారూ ఉన్నారు. వీరికి వారంలో రెండు, మూడు సార్లు డయాలసిస్‌ అవసరం. ఇలాంటి వారంతా దూర ప్రాంతాలకు వెళ్లేకుండా.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనిగిరి ఆసుపత్రిలోనే డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మొత్తం 16 పడకలు ఉన్న హాస్పిటల్​లో రోజుకు 50 మందికి పైగా రోగులకు డయాలసిస్‌ సేవలు ఇక్కడ అందిస్తున్నారు. అయితే గత నెలలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తింది. డయాలసిస్‌ కేంద్రంలోని.. ఏసీలు, పరికరాలు కాలిపోయాయి. విద్యుత్‌ సరఫరా లేక.. జనరేటర్‌ వినియోగించి కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు.

Kidney Patients: నెరవేరని నేతల హామీలు.. ఆదుకోవాలంటూ ఆవేదన

ఈ క్రమంలో పలుమార్లు జనరేటర్‌ మరమ్మతులకు గురై డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి. రోగులను హుటాహుటిన వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. అయినా సమస్య పరిష్కారానికి అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డయాలసిస్‌ రోగులకు మందులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని.. బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ ప్రమాదం కారణంగా కాలిపోయిన డయాలసిస్‌ పరికరాలను.. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ పరిశీలించారు. ఏర్పాటు చేసిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌కు అతి త్వరగా కనెక్షన్‌ ఇచ్చి కిడ్నీ బాధితుల సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

హాస్పిటల్ పూర్తయ్యి.. ఉద్దానం కిడ్నీ బాధితుల తలరాత మారేది ఎప్పుడో..?

కనెక్షన్‌ గురించి విద్యుత్తు శాఖ అధికారులను అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారని ఆసుపత్రి వైద్యులు ఆరోపిస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో.. జనరేటర్‌ సాయంతో డయాలసిస్‌ చేస్తున్నట్టు తెలిపారు.

"అది కాలిపోయి నెలరోజులు అవుతుంది. దానిని పట్టించుకునే నాథుడే లేరు. డయాలసిస్ నాలుగు గంటలు పెట్టాలి. ప్రస్తుతం మూడు గంటలు డయాలసిస్ పెడుతున్నారు. కనిగిరిలో డయాలసిస్ సేవలు అస్సలు బాగాలేదు. ఏసీలు కూడా పనిచేయడం లేదు. మూడు గంటలే డయాలసిస్ చేయడం వలన.. అది సరిపోవడం లేదు. ఆయాసం వస్తుంది".- నాగేశ్వరరావు, బాధితుడు -నేరేడుపల్లి

"ఇక్కడ బీపీ మెషీన్ లేదు. డయాలసిస్ నాలుగు గంటలు పెట్టాల్సింది.. మూడు గంటలే పెడుతున్నారు. నెల రోజులుగా కరెంటు లేదు. నెల రోజులుగా కరెంటు తెచ్చుకోకుండా అసలు ఏం చేస్తున్నారు. కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఏం మాట్లాడటం లేదు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోతే.. ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు". - ఇసాక్‌, బాధితుడు - మాజీ జెడ్పీటీసీ

ABOUT THE AUTHOR

...view details