రహదారులపైకి ప్రజలను రానివ్వకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యావసర దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. ఔషధ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా చేతులు శుభ్రం చేసుకుని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని మున్సిపల్ అధికారులు మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి పనిచేస్తున్న ఓ కార్పొరేట్ సంస్థ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. 20 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్టు చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ తెలిపారు.
చీరాలలో కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ రెండో రోజు కొనసాగుతోంది. చీరాల పట్టణంలో పోలీసులు నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తున్నారు.
చీరాలలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న పోలీసులు