ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కాపురం జిల్లా కోసం కొనసాగుతున్న నిరసనలు.. సైకిల్ యాత్ర భంగం

Protest for Markapur district: మార్కాపురం జిల్లా కోసం తలపెట్టిన సైకిల్ యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యాత్రకు బయలుదేరిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జేఏసీ నేతల మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది.

Protest for Markapur district
మార్కాపురం జిల్లా కోసం కొనసాగుతున్న నిరసనలు

By

Published : Mar 28, 2022, 1:59 PM IST

Updated : Mar 28, 2022, 2:30 PM IST

మార్కాపురం జిల్లా కోసం మార్కాపురం నుంచి సచివాలయం వరకు ఐకాస నాయకులు తలపెట్టిన సైకిల్ యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. యాత్రకు మద్దతుగా బయలుదేరిన తెదేపా నాయకులతోపాటు పలువురు జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని స్థానిక నాయకులు 55 రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సైకిల్ యాత్రకు సిద్ధమయ్యారు. దీంతో మార్కాపురంలో పోలీసులు భారీగా మోహరించారు.

మార్కాపురం జిల్లా కోసం కొనసాగుతున్న నిరసనలు

Interrupted Cycle Yatra యాత్ర సందర్బంగా ఇంటి నుంచి బయల్దేరిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో పాటు పలువురు ఐకాస నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతల అరెస్టు గురించి తెలుసుకున్న జేఏసీ నాయకులు.. ఐకాస నాయకులను తరలిస్తున్న పోలీస్​ వాహనాలను అడ్డుకున్నారు. నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, జేఏసీ నాయకులకు మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో జేఏసీ నాయకులను స్టేషన్​కు తరలించారు.

Last Updated : Mar 28, 2022, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details