ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కంచర్ల అంజయ్య (45) గా పోలీసులు గుర్తించారు. ఆరోగ్య సమస్యతో పాటు అప్పుల బాధ ఉండటం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంజయ్య కుటుంబీకులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అప్పుల బాధ, ఆరోగ్య సమస్యతో వ్యక్తి ఆత్మహత్య - person suicide in addanki latest news
అప్పుల బాధ, ఆరోగ్య సమస్యతో అద్దంకి పట్టణానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అద్దంకిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య