ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మ ఒడి పేరు చెప్పి... అకౌంట్​లోని లక్షా 90 వేలు స్వాహా

కొత్త పద్ధతిని ఎంచుకున్నాడు ఓ సైబర్ నేరగాడు. అమ్మఒడి పేరు చెప్పి అమాయకుడి అకౌంట్​లోని లక్షా 80వేల నగదును దోచుకున్నారు. పోలీసుల సాయంతో తన నగదును తిరిగి పొందాడు బాధితుడు.

By

Published : Jul 18, 2019, 2:59 AM IST

Updated : Jul 18, 2019, 8:20 AM IST

అమ్మ ఒడి నగదు వేస్తామంటూ... అకౌంట్​లోని లక్షా90వేలు స్వాహా

అమ్మ ఒడి నగదు వేస్తామంటూ... అకౌంట్​లోని లక్షా90వేలు స్వాహా

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామానికి చెందిన సింకుల కాశీరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్​లో జమ చేస్తామంటూ అతన్ని నమ్మించాడు. బాధితుడి డెబిట్ కార్డుపై ఉన్న అంకెలు, సీవీవీ నెంబర్​ను అడిగాడు. ఇదంతా నిజమే అని నమ్మిన కాశీరావు.. ఆ అజ్ఞానవ్యక్తికి వివరాలు చెప్పాడు. అనంతరం బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సుమారు లక్షా 90 వేల రూపాయలు కొట్టేశాడు. మోసపోయాడని తెలుసుకున్న కాశీరావు... పోలీసులను సంప్రదించాడు. అజ్ఞాత వ్యక్తి ఆ డబ్బుతో ఆన్​లైన్ షాపింగ్ చేసినట్లు కనుక్కొన్న పోలీసులు... లావాదేవీలకు సంబంధించి పేటీఎం, ఫ్లిప్​కార్టు ప్రతినిధులతో మాట్లాడారు. నగదును వెనక్కి రప్పించే యత్నం చేశారు. ఇప్పటికే 80 వేల నగదు రికవరీ చేయగా... మరో లక్ష నగదు నాలుగు రోజుల్లోగా బాధితుడి ఖాతాలో జమ అవుతుందని పోలీసులు తెలిపారు.

Last Updated : Jul 18, 2019, 8:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details