ప్రకాశంజిల్లా కురిచేడు మండలం పోట్లపాడు - గంగదొనకొండ గ్రామాల మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.మృతుడు గుంటూరు జిల్లా వినుకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన వేగుల బ్రహ్మయ్య (35)గా గుర్తించారు. బ్రహ్మయ్య ద్విచక్రవాహనంపై దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - ప్రకాశం జిల్లా తాజా మర్ణణ వార్తలు
ప్రకాశంజిల్లా దర్శినియోజకవర్గం కురిచేడు మండలం పోట్లపాడు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
person died in prakasam dst kurichedu mandal potlapadu area