ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపలు పట్టేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి - prakasam dst death latest news

చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పర్చూరులో జరిగింది.

person died due to unfortunatly jumped into a canel in prakasam dst parchuru
person died due to unfortunatly jumped into a canel in prakasam dst parchuru

By

Published : Jul 6, 2020, 4:16 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారి పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పర్చూరు పట్టణంలో ఒక అపార్టుమెంట్ లో వాచ్ మన్ గా పనిచేసే జాలుమురి జగన్నాథం (30) గా మృతుడిని గుర్తించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళిన జగన్నాథం... గట్టుమీద కూర్చున్నాడు. చేపలు పడుతుండగా.. ఆ గట్టు మట్టిపెళ్లులు విరిగి చెరువులో పడిపోయాడు. ఈత రాని కారణంగా జగన్నాథం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్దానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

...view details