వార్తాపత్రికల లోడుతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురై.. సిరిమల్లె వెంకటేశ్వర్లు అనే వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం మహామదాపురం సమీపంలో.. తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమే కారణమని క్షతగాత్రులు వెల్లడించారు.
చెట్టును ఢీకొన్న వ్యాన్.. వ్యాపారి మృతి
వాహనం డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం.. ఓ ప్రయాణికుడి ప్రాణాలు తీసింది. ప్రకాశం జిల్లా పొదిలి నుంచి గిద్దలూరు వెళ్తుండగా.. అదుపుతప్పి వాహనం చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నిమ్మకాయల వ్యాపారి వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయాడు.
కొనకమిట్ల మండలం చినారికట్లకు చెందిన వెంకటేశ్వర్లు.. నిమ్మకాయలు విక్రయించేందుకు బయలుదేరాడు. తెల్లవారుజామున పొదిలి నుంచి గిద్దలూరు వెళ్తున్న వార్తాపత్రికల వ్యాన్ ఎక్కాడు. వాహన చోదకుని నిద్రమత్తుతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపంచనామా కోసం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు ఆటోలో తరలించారు. ఆస్పత్రి బయట గంటసేపు వేచి చూసినా.. వైద్యులు రాలేదని మృతుడి బందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:కారును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురికి గాయాలు