ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్న తహసీల్దారు కార్యాలయం.. ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. పాత భవనం పాడుబడి... శిథిలావస్థలో ఉన్నందున... తహసీల్దారు కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చారు. ముందున్న భవనాన్ని అలాగే వదిలేశారు. ఆ కార్యాలయ సమీపంలోనే పలు రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంవల్ల ఆ ప్రాంతమంతా నిత్యం జనాలతో రద్దీగా ఉంటుంది. దీంతో పాడుబడిన కార్యాలయం ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత కార్యాలయాన్ని తొలగించాలని కోరుతున్నారు.
శిథిలమైన భవనాన్ని కూల్చేదెన్నడో..? - కనిగిరి తాజా వార్తలు
తహసీల్దారు కార్యాలయం పాడుబడిందని కొత్తదానిలోకి మార్చారు. కానీ దాన్ని కూల్చడం మరిచారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వచ్చిన ప్రజలు... పక్కనే శిథిలావస్థలో ఉన్న భవనం ఎప్పుడు కూలుతుందోనని భయపడుతున్నారు.
శిథిలమైన భవనాన్ని కూల్చేదెన్నడో!