ప్రకాశం జిల్లా ఒంగోలులో రేపు జనసేన ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు.సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. నియోజకవర్గ జనసేన అభ్యర్థి రియాజ్ తరఫున ప్రచారం చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు అద్దంకి బస్టాండ్ కూడలి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు రియాజ్ చెప్పారు. విజయవంతం చేయాలని జనసైనికులను కోరారు. సామాన్యులనుచట్టసభలకు పంపాలన్న లక్ష్యంతో... డబ్బు ప్రభావం లేని రాజకీయాలకు కృషి చేస్తున్న జనసేనను ఆశీర్వదించాలన్నారు.