రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు డీడీఓ అధికారాలను నిలిపివేయటాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. తమకున్న అధికారాలను వీఆర్వోలకు బదలాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే దిశగా పని చేసినప్పటికీ.. ఈ విధంగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు.
'మా అధికారాలను వీఆర్వోలకు బదలాయించడం ఏమిటి ?'
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేశారు. డీడీఓ అధికారాలను నిలిపివేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
మార్కాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులు ఆందోళన