ఒంగోలు రిమ్స్‌కు కొవిడ్ బాధితుల అవసరాల నిమిత్తం ఓ ఆక్సిజన్ ట్యాంకు వచ్చింది. జీజీహెచ్ అవసరాలకోసం, అక్కడ ఉన్న అక్సిజన్ ఫ్లాంట్‌లో నిల్వ చేశారు. సుమారు 20 కిలోలీటర్ల ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం ఉండగా.. 18 కిలోలీటర్ల ఆక్సిజన్ దిగుమతయ్యింది. పాత నిల్వలు కలిపి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ నిల్వ ఉంది. ఇవి రెండు రోజుల వరకు సరిపోతాయని వైద్యాధికారులు తెలిపారు. ఇవి కాకుండా దాదాపు 100 బల్క్ సిలెండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వీటిని వినియోగిస్తున్నారు. విశాఖ నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకరు.. ప్రకాశం జిల్లా మార్టురూ మండలంలోని టోల్ గేట్ వద్ద మరమ్మతులకు గురై నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ ముగ్గురు మెకానిక్‌లతో బాగు చేయించి పోలీస్ సిబ్బంది తో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.
ఒంగోలు రిమ్స్‌కు ఆక్సిజన్ ట్యాంకర్ - ఒంగోలు రిమ్స్‌కు ఆక్సిజన్ ట్యాంకర్
కొవిడ్ బాధితుల అవసరాల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు ఓ ఆక్సిజన్ ట్యాంకు వచ్చింది. సుమారు 18 కిలో లీటర్ల ఆక్సిజన్‌ను అక్కడ నిల్వ ఉంచారు.
ఒంగోలు రిమ్స్‌కు ఆక్సిజన్ ట్యాంకర్