Lock to RBK :ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రైతు భరోసా కేంద్రం-3 అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఏడాదిన్నర నుండి అద్దె ఇవ్వడం లేదని భవనం యజమాని తాళం వేసాడు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా.. బడ్జెట్ లేదనే సమాధానం చెబుతున్నారని భవన యజమాని చెన్నారెడ్డి తెలిపాడు. అధికారుల నుంచి సరైన హామీ రాకపోవడంతో ఈ విధంగా చేసినట్లు స్పష్టం చేశాడు.
అద్దె కట్టలేదని.. ఆర్బీకేకు తాళం వేసిన భవన యజమాని
Lock to RBK : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రైతు భరోసా కేంద్రం-3కు భవన యజమాని తాళం వేశాడు. ఏడాదిన్నర నుండి అద్దె చెల్లించడం లేదని యజమాని తెలిపాడు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా.. అద్దె చెల్లించనందుకే తాళం వేశానని స్పష్టం చేశాడు.
నా అద్దె డబ్బు నాకివ్వమని తాళం వేశాను. ఇంతకుముందు మంత్రి వచ్చినప్పుడే నేను తాళం వేస్తే.. ఏఓ, అలాగే అధికారులు అందరూ కలిసి బిల్లులు వస్తాయని చెప్పి ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. నెలకు రూ.4500 చొప్పున ఏడాదిన్నర బిల్లులు, అలాగే కరెంట్ బిల్లు కూడా రావాలి. అందుకోసమే తాళం వేశాను. కానీ అంతకుమించి వేరే ఉద్దేశ్యం లేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా బడ్జెట్ అయిపోయింది అంటున్నారు. మంత్రి వచ్చినప్పుడు కూడా పేమెంట్ చేస్తామని చెప్పి.. మూడు బిల్లులకు సంతకాలు పెట్టించుకోని వెళ్లారు. బిల్లులు వేయలేదు. -చెన్నారెడ్డి, ఆర్బీకే భవన యజమాని
ఇవీ చదవండి: