ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం - కనిగిరిలో ఆస్తి తగాదాలతో ఆత్మహత్యాయత్నం

ఆస్తి విషయంలో తనకు న్యాయం జరగదేమో అనే భయంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఘటన వివరాలివి..!

ఆస్తి తగాదాల్లో న్యాయం జరగదని ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 7, 2019, 1:49 PM IST

న్యాయం జరగదని పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కె.రామయ్య ఆస్తి గొడవల విషయంలో తనకు న్యాయం జరగదనే భయంతో పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి గొడవల నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసు​లకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్​కు వచ్చిన రామయ్య తనకు న్యాయం జరగదనే ఆందోళనతో అక్కడే బలవన్మరణానికి యత్నించాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న రామయ్యను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details