ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలోని నర్సమందాపురం గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. విందు భోజనాల సమయంలో రేగిన చిన్న గొడవ కారణంగా... వరుడి తరఫు బందువులు వధువు మేనమామ మన్నేపల్లి సురేష్‌పై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో సురేష్ తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్య చికిత్స నిమిత్తం కనిగిరికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి విందులో ఘర్షణ..వధువు బంధువుపై గొడ్డలితో దాడి..మృతి
ప్రకాశం జిల్లా నర్సమందాపురంలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. వధువు మేనమామపై వరుడి తరఫు బంధువులు గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.
విందుభోజనం విషయంలో ఘర్షణలో మృతి చెందిన వ్యక్తి