ప్రకాశం జిల్లా దర్శిలో వృద్ధ దంపతులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కురుచేడు మండలం మర్లపాలెంకు చెందిన అన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఆదెమ్మ అనే భార్యాభర్తలు.. పది సంవత్సరాలుగా దర్శిలోని దేసువారి సాయిబాబా గుడి వద్ద నివాసముంటున్నారు. వారి కుమారుడు నారాయణరెడ్డి వారితోనే కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి భోజనాల అనంతరం కొడుకు ఇంటిబయట పడుకోగా.. వృద్ధ దంపతులు లోపల నిద్రించారు. తెల్లవారుజాము నారాయణరెడ్డి లేచి చూసేసరికి వారు శరీరం మీద కత్తి గాయాలతో విగతజీవులుగా పడిఉన్నారు. అతను వెంటనే బంధువులకు, చుట్టుపక్కలవారికి సమాచారం అందించాడు. మరణవార్త తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
వృద్ధ దంపతులు మృతి.. ఆత్మహత్యా! హత్యా!
భార్యాభర్తలుగా కలిసి బ్రతికినవారు చావులోనూ విడిపోలేదు. ఒకరి వెంటే మరొకరు అన్నట్లు ఆఖరి శ్వాసలోనూ ఒకరికొకరు తోడు అంటూ వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా దర్శిలో వృద్ధ దంపతులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. వారిది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధ దంపతులు మృతి.. ఆత్మహత్యా! హత్యా!