2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా..... నేడు సీఎం చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభలో పాల్గొనేందుకు ఒంగోలు రానున్నారు. మధ్యాహ్నం మినీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఎన్నికల ప్రచార వ్యూహంపై ఖరారైన అసెంబ్లీ అభ్యర్థులతో చర్చించనున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు హజరయ్యే విధంగా పార్టీ నేతలు సభా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ముగింపు అనంతరం... ప్రత్యేక హెలికాప్టర్లో గుంటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు హజరవుతారు.
రేపు సీఎం కర్నూలు పర్యటన
రేపు ఉదయం కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో ఎన్నికల సన్నాహక సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాకు పయనమవుతారని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.