ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఆటోనగర్ ఎరుకల కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. పోలా కోటేశ్వరరావు, పాలపర్తి చిన్న మధ్య సాయంత్రం సమయంలో చిన్నపాటి ఘర్షణ జరిగింది. అదికాస్తా పెద్దదై ఒకరినొకరు బరిసెలతో పొడుచుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో చిన్న... బరిసెతో కోటేశ్వరరావు గొంతులో పొడవుగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ఇరువురు ఫూటుగా మద్యం తాగారని స్థానికులు తెలిపారు. వీరిద్దరు వరసకు అన్నదమ్ములే అని చెప్పారు స్థానికులు.
మద్యం మత్తులో గొడవ... ఒకరు మృతి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఆటోనగర్ ఎరుకల కాలనీలో మద్యం మత్తులో తమ్ముడు... అన్నను దారుణంగా హత్యచేశాడు. చిన్న గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారి ప్రాణాలు తీసే వరకూ వెళ్లిందని స్థానికులు తెలిపారు.
muredr in prakasam dst darsi due to drunen nisha