Monkey selfies: ప్రకాశం జిల్లా దర్శిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఫోన్ చేతిలో పట్టుకుని వాకింగ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలో.. పక్క నుంచి దూసుకొచ్చిన ఓ కోతి.. క్షణాల్లో చేతిలోని మొబైల్‌ను లాక్కెళ్లింది. పరిగెత్తుకెళ్లి గొడెక్కి కూర్చుంది. అయితే.. చోరీ టాస్క్ పక్కాగా కంప్లీట్ చేసిందిగానీ.. తాను కొట్టుకొచ్చిన వస్తువేంటన్నది మాత్రం దానికి అర్థం కాలేదు. గోడపై కాసేపు.. తర్వాత చెట్టు మీద ఇంకాసేపు.. ఆ తర్వాత బిల్డింగ్ ఎక్కి మరికాసేపు.. ఫోన్ తేరిపార చూసింది. ఈ క్రమంలో చూస్తున్నవారికి.. నిజంగానే కోతి సెల్ఫీ దిగుతోందా అన్నట్టుగా ఫోజులు పెట్టింది.
ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. ఆపై సెల్ఫీ ఫోజులు..! - దర్శిలో సెల్ఫీలు దిగిన కోతి
Monkey selfies: సాధారణంగా మనుషుల చేతుల్లోంచి తునుబండారాలు ఎత్తుకెళ్తుంటాయి కోతులు.. కానీ ఓ వానరం మాత్రం స్మార్ట్ ఫోన్ లాక్కెళ్లింది! ఆ వస్తువేంటో.. ఏమైనా ఉపయోగపడుతుందేమోనని చాలా సేపు ప్రయత్నించింది. అయితే.. ఆ కోతి ట్రయల్స్ ఎలా ఉన్నాయంటే.. చూసేవాళ్లకు అచ్చం సెల్ఫీ దిగుతోందా? అని అనిపించేలా ఉన్నాయి. మరి, ఆ కోతి వేషాలు ఎలా ఉన్నాయో మీరూ చూడండి..
వానరం సెల్ఫీ
ఇలా.. దాదాపు గంటసేపు ముప్పు తిప్పలు పెట్టి.. అనంతరం గ్రౌండ్ లో ఉన్న బిల్డింగ్‌పైన ఫోన్ వదిలేసి వెళ్లింది. హమ్మయ్య అనుకున్న ఫోన్ ఓనరు.. ఓ నిచ్చెన తెచ్చుకొని, నానా కష్టాలు పడి భవనం ఎక్కి.. మొత్తానికి తన కష్టార్జితమైన మొబైల్‌ను దక్కించుకున్నాడు.
ఇవీ చదవండి: