ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని 70వ పుట్టినరోజు సందర్భంగా 'సేవా సప్తాహం' - seva saptaham

ఈనెల 17 తేదీన నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సేవా సప్తాహం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Modi's birthday celebrations under the auspices of BJP
ప్రధాని 70వ పుట్టిన రోజు

By

Published : Sep 14, 2020, 7:34 PM IST

ప్రకాశం జిల్లాలో..

ఒంగోలులో సేవా సప్తాహంలో భాగంగా మొదటి రోజు సేవా కార్యక్రమాలను జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు “సేవా సప్తాహం“ పేరిట సేవా కార్యక్రమాలు జరగనున్నాయి. భాజాపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నాయకత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భాజాపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు తెలియజేశారు. ఒంగోలు నగరంలో మామిడిపాలెంలో మొదటి రోజు కార్యక్రమం జిల్లా ప్రముఖులు శిద్దా వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ నాయకురాలు పురంధేశ్వరి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శిరసనగాండ్ల శ్రీనివాసులు ప్రారంభించారు. ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు, వృద్ధ ఆశ్రమాలలో వృద్దులకు పండ్లను పంపిణీ చేశారు. మోదీ ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సమస్యలను చారిత్రాత్మక నిర్ణయాలతో పరిష్కరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కృష్ణా జిల్లాలో..

ప్రధాని 70వ పుట్టిన రోజును పురస్కరించుకుని.... రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజులపాటు సేవా సప్తాహం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సప్తాహం ప్రారంభ సందర్భంగా రోగులకు పండ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈనెల 20వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తామని తెలిపారు. మొక్కల పెంపకం... వికలాంగులకు పరికరాలు అందించడం, రక్తదానం చేయడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రియల్ గవర్నెన్స్ అనేది మోదీ చేసి చూపిస్తున్నారని... సంక్షేమంతో పాటు మంచి పాలన అందేలా భాజపా ప్రయత్నం చేస్తోందని వీర్రాజు వివరించారు.

విశాఖ జిల్లాలో..

దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకుని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦ భాజాపా నాయకులు ప్రత్యేక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాల్లో భాగంగా యస్. నర్సాపురం గ్రామ౦ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ జిల్లా బీజేపీ నాయకులు తోట నగేష్ రవిరాజు, మంచాల గాంధీ ఆధ్వర్యంలో పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికులకు సన్మానం చేసి, నిత్యావసర సరుకులను అందజేశారు.

గుంటూరు జిల్లాలో..

నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో వారం రోజుల పాటు సేవా సప్తాహం పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భాజాపా రాష్ట్ర మాజీ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సేవా సప్తాహంలో భాగంగా బ్రాడిపేటలోని అంధుల పాఠశాలకు రైస్ కుక్కర్స్, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని కన్నా కొనియాడారు. నిస్వార్థంగా దేశరక్షణ, దేశ అభివృద్ధి , దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి అని అన్నారు. సరైన సమయంలో జనతా కర్ఫ్యూ, లాక్​డౌన్​ను అమలు చేసి కోవిడ్​ని కట్టడి చేశారన్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా లాక్​డౌన్ సమయంలో పేదలకు సాయం చేయలేదని.. కోట్లాది మంది పేద ప్రజలకు భాజాపా పార్టీ నిత్యావసర సరుకుల పంపిణీ చేసిందన్నారు.

ఇదీ చూడండి.దేవాలయాలపై దాడులను ఖండిస్తూ తెదేపా నిరసన

ABOUT THE AUTHOR

...view details