కందుకూరు వైకాపా నాయకులు ప్రజల్లో అపోహలు, అనుమానాలను కలిగించడం సరికాదని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు హితవు పలికారు. అనుభవం ఉన్న నాయకులు ఇలా మాట్లాడటం తగదన్నారు.
వైకాపాకు ఎమ్మెల్యే పోతుల హితవు
By
Published : Mar 14, 2019, 3:59 PM IST
వైకాపాకు ఎమ్మెల్యే పోతుల హితవు
ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు... ప్రతిపక్షం తీరును తప్పుబట్టారు. కందుకూరు వైకాపా నాయకులు ప్రజల్లో అపోహలు, అనుమానాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. అనుభవం కలిగిన నేతలు ఈవిధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తాను వైసీపీ నుంచి తెదేపాలో చేరిన తర్వాతి రెండు సంవత్సరాల కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టానని వివరించారు. పట్టణంలోని కోవూరు రోడ్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.