ఒంగోలులో మినీ ఇండోర్ స్టేడియం ప్రారంభం - ఒంగోలులో మినీ ఇండోర్ స్టేడియంను ప్రారంభం
ఒంగోలులో నిర్మించిన మినీ ఇండోర్ స్టేడియంను మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్మించిన మినీ ఇండోర్ స్టేడియంను రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ఎన్నికలు రావడంతో ప్రారంభం కాలేదు. ఇప్పుడు అన్ని హంగులతో పూర్తి చేసి ప్రారంభించారు. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని...క్రీడా మైదానాలను, స్టేడియంల నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. స్టేడియం ముందు ఏర్పాటు చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ప్రారంభించారు.. మంత్రులు బ్యాడ్మింటన్ ఆడి ఆకట్టుకున్నారు.