Minister Suresh distributed rickshaws : కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని మంత్రి అదిములపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండలానికి మంజూరైన 43 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు. గురిజేపల్లి , యర్రగొండపాలెం , కాశికుంటా తండాలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను, యర్రగొండపాలెంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించారు.
రిక్షా తొక్కిన మంత్రి ఆదిమూలపు సురేష్ - రిక్షా ఎక్కి తొక్కిన మంత్రి ఆదిమూలపు సురేష్
Minister Suresh distributed rickshaws : కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని కొనియాడారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి మంజూరైన 43 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు
మంత్రి ఆదిమూలపు సురేష్