ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దిల్లీ వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్​కు రండి'

దిల్లీలో మతపర కార్యక్రమాలకు వెళ్లివచ్చిన వారందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్​కు రావాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రజలు బాధ్యతాయుతంగా నడుచుకుంటేనే కరోనా వ్యాప్తిని అరికట్టగలమన్నారు. నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

Minister balineni
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

By

Published : Apr 3, 2020, 7:24 PM IST

ప్రకాశం జిల్లాలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దిల్లీ, ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సమూహాల వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న మంత్రి... వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌ డౌన్​కు సహకరించాలని కోరారు. దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లినవారు బాధ్యతాయుతంగా క్వారంటైన్​కు రావాలన్నారు.

దిల్లీ నుంచి వచ్చిన వారందరికీ పాజిటివ్‌ వస్తుందని భయపడాల్సిన పనిలేదన్నారు. కరోనా ప్రాణాంతకం కాదన్న ఆయన.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని నివారించగలమన్నారు. లాక్​డౌన్​లో నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అవసరమైతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని బాలినేని చెప్పారు. ఒంగోలులో ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఆయన...విద్యుత్తు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details