ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించండి'

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్​తో రైతులెవ్వరూ నష్టపోకూడదని.. వారు పండించిన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని.. మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

minister aadimulapu suresh video conference with agricultural officers at yerragodapalem in prakasam district
వ్యవసాయ అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్

By

Published : Apr 20, 2020, 7:33 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్​లోని వ్యవసాయ, ఉద్యానవన పంటల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన రైతులకు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడానికి తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు నష్టపోకూడదన్నారు. పండించిన పంటలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. యర్రగొండపాలెంలో రైతు బజార్​ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details