50 లక్షల పనికి ఇంత తక్కువా? ధర్మమేనా? - సంక్షేమ శాఖ అధికారి
ప్రకాశం జిల్లాలో ఉన్నతాధికారి లాంచవతరం వీడియో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ చేరడంతో ఆ అధికారి సెలవు పెట్టి వెళ్లి పోయారు.
ప్రకాశం జిల్లా వికలాంగులు, వృద్ధులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులుగా సింగయ్య పనిచేస్తున్నారు. వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిగా.. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే వారికి ఏటా రెన్యూవల్ చేసే అధికారాన్ని అడ్డం పెట్టుకుని లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఈత ముక్కలకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ నిర్వాహకులు సింగయ్య దగ్గరకు వచ్చారు. వృద్ధాశ్రమానికి రెన్యూవల్ చేయడానికి 2 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు..దానికి సంబంధిత వ్యక్తి అంత ఇచ్చుకోలేనని, 20వేల వరకు ఇచ్చుకుంటానని బతిమలాడుతున్నట్లు వీడియో రికార్డింగ్లో ఉంది.