ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని ఆర్కే భార్య శిరీష చెప్పారు. మావోయిస్టులకు పోలీసులు వైద్యం అందనివ్వడం లేదని ఆరోపించారు. మావోయిస్టులకు వెళ్లే ఆహారంలో విషం కలుపుతున్నారని, ఆర్కే విషయంలో విష ప్రయోగం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టు నేత ఆర్కే ప్రజల కోసం తన జీవితాన్నే ధారపోశారని చెప్పారు. ఆర్కే మృతిపై పార్టీ ప్రకటన తర్వాత బోరున విలపించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలుకూరుపాడులో ఉంటున్న శిరీష.. ఆర్కే మృతదేహాన్ని చూసే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. భర్తను కోల్పోయిన శిరీషను పలువురు విరసం నేతలు పరామర్శించారు.
ఆర్కే విప్లవకారుడిగా జీవించాడు.. విప్లవకారుడిగానే మరణించాడు: విరసం నేత కల్యాణరావు