ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా రైతు మాణిక్యమ్మ తనకు ఉన్న ఎకరాన్నర భూమిని అధికారులు ఇళ్ల స్థలాల కోసం తీసుకుంటున్నారని ఆవేదన చెందింది. ఆ భూమి లేకుంటే తనకు జీవనాధారం లేదని మనస్తాపంతో పురుగులమందు డబ్బాతో ఆర్డీవో కార్యాలయానికి వచ్చింది. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోయింది. దీనిపై స్పందించిన అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆమె వెనక్కు తగ్గింది.
ఆర్డీవో కార్యాలయంలో పురుగులమందు డబ్బాతో మహిళ హల్చల్ - lady farmer committ suicide for taking her land for house to poor people
పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారుతోంది. పట్టాలు లేని పంట భూములు చదును చేసి... పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. అయితే ఎప్పటి నుంచే ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నామని వాటిని లాక్కొంటే మా బతుకులేం కావాలని బాధితులు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ మహిళా రైతు తన భూమి తీసుకుంటున్నారనే ఆవేదనతో పురుగులమందు డబ్బాతో ఆర్డీవో కార్యాలయానికి వచ్చింది.
తన భూమిని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా రైతు