ప్రకాశం జిల్లా పామూరు మండలం భూమిరెడ్డిపల్లిలో ఓ వివాహిత ప్రమాదవశాత్తూ మరణించింది. మునగాల లక్ష్మీదేవి.. తన భర్త, ఇద్దరు పిల్లలతో ద్విచక్రవాహనంపై ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామంలోని ఉంటున్న తన చెల్లెలి ఇంటికి వెళ్లింది.
తిరిగి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చున్నీ ద్విచక్రవాహనం చక్రంలో చిక్కుకుని అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో లక్ష్మీదేవి తలకు గట్టిగా దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదైంది.