ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాల పురపాలక ఛైర్మన్​గా జంజనం శ్రీనివాసరావు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లా చీరాల పురపాలక సంఘం ఛైర్మన్​గా జంజనం శ్రీనివాసరావు, వైస్ ఛైర్మన్​గా బోనిగల జైసన్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోల్ ఆర్​డీవో ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

Janjanam Srinivasa Rao is a chirala Municipal Chairman
చీరాల పురపాలక ఛైర్మన్​గా జంజనం శ్రీనివాసరావు ఏకగ్రీవం

By

Published : Mar 18, 2021, 3:37 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఒంగోల్ ఆర్​డీవో ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 33 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్​గా జంజనం శ్రీనివాసరావు, వైస్ ఛైర్మన్​గా బోనిగల జైసన్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎక్స్ అఫిషియో సభ్యులుగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. నూతనంగా ఎంపికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details