ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భారీ వర్షాలు... నిండిన చెరువులు, కుంటలు

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సగిలేరు, ఎనుమలేరు, గుండ్లకమ్మ వాగులకు వరద నీరు పోటెత్తింది. కొండపేట సమీపంలోని సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామం వద్ద నల్లమల అడవుల్లోని గుండ్ల మోటు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.

By

Published : Jul 24, 2021, 12:18 PM IST

Published : Jul 24, 2021, 12:18 PM IST

Updated : Jul 24, 2021, 12:39 PM IST

JALAKALA
భారీ వర్షాలకు... జిల్లాలో నిండిన చెరువులు,కుంటలు

గిద్దలూరు నియోజకవర్గంలో అలుగు పారుతున్న వాగులు,నిండు కుండగా చెరువులు

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. సగిలేరు, ఎనుమలేరు, గుండ్లకమ్మ వాగులకు వరద నీరు పోటెత్తింది. గిద్దలూరు లోని సగిలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. కొండపేట సమీపంలోని సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.

గిద్దలూరు మండలం వెంకటాపురం ప్రాంతంలోని గుండ్ల మోటు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. రాచర్ల మండలంలోని నెమలి గుండ్ల రంగనాయకస్వామి ఆలయ గుండం పూర్తిగా నిండపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుండం పరిసరాల్లోకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మండలంలోని రామన్నకతువా జలాశయం నిండి అలుగు పారుతూ వరద నీరంతా కంభం చెరువుకు చేరుతోంది. చెరువు జలకళ సంతరించుకుంది.

Last Updated : Jul 24, 2021, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details