ప్రకాశం జిల్లా సింగరకొండ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మౌలా సాహెబ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అద్దంకి మండలోని వెంపరాల, సాధునగర్ ప్రాంతాల్లో మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు అతను అంగీకరించాడు. అంతే కాకుండా గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి ఐదు సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అంతర్ జిల్లా దొంగ అరెస్టు... బంగారం స్వాధీనం - prakasham district crime news
ఒంటరి మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న అంతర్ జిల్లా దొంగను ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అంతర్ జిల్లా దొంగ అరెస్టు... బంగారం స్వాధీనం