Initiation for Markapuram District : మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. వెనుక బడిన పశ్చిమ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ.. గత 37 రోజులుగా ఇక్కడి ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఐకాస నాయకులు గురువారం ఉదయం ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.
మార్కాపురం జిల్లాకోసం రెండవ రోజు ఆమరణ దీక్ష.. - మార్కాపురం జిల్లా రెండవరోజు ఆమరణ దీక్ష.
Initiation for Markapuram District : మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. వెనుక బడిన పశ్చిమ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ.. గత 37 రోజులుగా ఇక్కడి ప్రజలు ఉద్యమబాట పట్టారు.
Initiation for Markapuram Distric
మార్కాపురాన్ని జిల్లా చేసేంతవరకు దీక్షలను విరమించేది లేదని ఐకాస నాయకులు స్పష్టం చేశారు. వీరి దీక్షకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి దీక్షాస్థలికి చేరుకొని.. సంఘీభావం ప్రకటించారు. ఐకాస నాయకుల దీక్షను పోలీసులు భగ్నం చేస్తారనే అనుమానం రావడంతో వారికి మద్దతుగా జిల్లా సాధన సమితి నాయకులు, స్థానిక ప్రజలు రాత్రంతా శిబిరం వద్దనే గడిపారు.
ఇదీ చదవండి :అగ్గిపెట్టెల లారీ దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్