ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్శిలో పెరుగుతున్న కేసులు.. ఆంక్షల అమలుకు సిద్ధంగా అధికారులు - red zones in prakasham district

ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తహసీల్ధారు తెలిపారు.

Increasing corona cases
దర్శిలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Jun 30, 2020, 1:04 AM IST

దర్శిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఫలితంగా.. కొవిడ్-19 నిబంధనలు కఠినంగా అమలుపరచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఇటీవల 65 ఏళ్ల వృద్దుడు కరోనాతో మృతి చెందాడు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శి పరిధిలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్​లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలుపరిచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తహసీల్ధారు వరకుమార్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details