ప్రకాశం జిల్లా అద్దంకి పట్నంలో భవాని సెంటర్ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తూ.. అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
వారి నుంచి 140 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సహకరిస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాల విలువ సుమారు. రూ. 21,000 ఉంటుందన్నారు. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.