తెదేపా ఎమ్మెల్యే కరణం బలరాంతో... వైకాపా నేతలు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వ్యాఖ్యనించారు. చీరాలలో స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరవుతున్న బలరాంను అడ్డుకోవడం సరికాదన్నారు. గతంలో ప్రభుత్వ కార్య్రకమాలకు హాజరైన తెదేపా ఎమ్మెల్యేలను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరవ్వడాన్ని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే... సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే... సామాన్యుల పరిస్థితేంటి?: కళా
స్వాతంత్ర్య దినోత్సవాలకు హాజరవుతున్న చీరాల శాసనసభ్యులు కరణం బలరాంను వైకాపా నేతలు అడ్డుకోవటాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామిక చర్యగా వ్యాఖ్యానించారు.
కళా